: కోల్ కతా లోకల్ ట్రైన్ లో ఇరువర్గాల ఘర్షణ... నాటు బాంబులతో దాడులు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నేటి తెల్లవారుజామున నాటు బాంబులు పేలాయి. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాలు నాటు బాంబులతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. నగరంలోని టిటాగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. టిటాగఢ్ రైల్వే స్టేషన్ దాటిన కొద్దిక్షణాల్లోనే రైల్లో బాంబుల మోత వినిపించింది. తెల్లవారుజామునే, అది కూడా లోకల్ ట్రైన్ లో జరిగిన ఈ పేలుడుతో కోల్ కతా వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటీన అక్కడకు చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.