: 'నో కాంప్రమైజ్' అంటున్న దీదీ


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రం తీసుకువస్తున్న భూసేకరణ బిల్లుపై రాజీపడేది లేదని స్పష్టం చేశారు. దానికి మద్దతివ్వకూడదన్న తన గత నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. పురూలియాలో మీడియాతో మాట్లాడుతూ... ల్యాండ్ బిల్లుకు ఎందుకు మద్దతివ్వాలని ప్రశ్నించారు. ఆ బిల్లు విషయంలో 'నో కాంప్రమైజ్' అంటూ వ్యాఖ్యానించారు. ఇది మట్టితో ముడిపడిన అంశమని, ఇది తమ పోరాటంతో ముడిపడిన అంశమని పేర్కొన్నారు. తమ పార్టీ ఏ విధంగానూ భూసేకరణ బిల్లుకు మద్దతివ్వబోదని తేల్చి చెప్పారు. పార్లమెంటులో తమ వైఖరిని గట్టిగా చాటామని దీదీ వివరించారు.

  • Loading...

More Telugu News