: ఫోన్ చేసి సర్ ప్రైజ్ చేసిన ఒబామా!


'మదర్స్ డే' సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తనదైన శైలిలో ఆశ్చర్యపరిచారు. మిన్నెసోటా, ఆరిజోనా, ఫ్లోరిడా ప్రాంతాలకు చెందిన ముగ్గురు మహిళలకు ఫోన్ చేసి వారిని సర్ ప్రైజ్ చేశారు. "హలో... నేను బరాక్ ఒబామాను మాట్లాడుతున్నాను" అనేసరికి వారు విస్మయం చెందారు. మాట్లాడుతున్నది అమెరికా అధ్యక్షుడని గ్రహించగానే వారిలో ఆనందం వెల్లివిరిసింది. వారికి ఒబామా 'మదర్స్ డే' శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లల పెంపకంలో ఎదురయ్యే కష్టాలు ఎలాంటివో, తల్లి వాటిని ఎంత సమర్థంగా పరిష్కరిస్తుందో ఆయన వారితో ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News