: ఎవరినో కాపాడేందుకు నన్ను బలిచేశారు: దాసరి ఆవేదన
తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు జన్మదిన వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై ఓ మచ్చ పడిందని, త్వరలోనే దాన్ని తుడుచుకుంటానని అన్నారు. రాజకీయాల్లోకి రావడమే తాను చేసిన మొదటి తప్పు అని పేర్కొన్నారు. ఎవరినో కాపాడేందుకు తనను బలిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా విజయనిర్మలకు స్వర్ణ కంకణం బహూకరించారు. బొగ్గు కుంభకోణం నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది.