: ఫోన్ చేసి జయలలితను అభినందించిన మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ అన్నా డీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అక్రమాస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, నజ్మా హెప్తుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీఎంసీ నేత జీకే వాసన్ తోపాటు పలువురు పారిశ్రామిక వేత్తలు, తమిళ సినీ ప్రముఖులు జయలలితకు అభినందనలు తెలిపినట్టు అన్నా డీఎంకే తెలిపింది. నిర్దోషిగా తీర్పు వెలువడడంతో మరోసారి ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్నారు.

  • Loading...

More Telugu News