: ఐపీఎల్ లో వేలకోట్ల బెట్టింగ్...కలకలం రేపుతున్న లలిత్ మోడీ ట్వీట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ పై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ చేసిన ట్వీట్ క్రీడా ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ లో జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారన్న అంశం ఐపీఎల్ ప్రతిష్ఠను మసకబార్చేలా చేస్తోంది. ఐపీఎల్ పై ప్రారంభంలో ఉన్నంత మోజు ఇప్పుడు కనపడడం లేదు. మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ అంశాలు ఐపీఎల్ కు ప్రతిబంధకాలుగా మారాయి. వాటి కారణంగా స్టేడియంలలో అభిమానుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో 'చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన నలుగురు ఆటగాళ్లకు మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగస్వామ్యముంది' అంటూ లలిత్ మోడీ చేసిన ట్వీట్ క్రికెట్ ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టింది. అంతే కాకుండా ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కు 10 వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతోందంటూ లిలిత్ మోడీ బాంబు పేల్చాడు.