: ఆపిల్ సత్తా చాటింది... తొలిసారి జియోమీని అధిగమించింది


ఆపిల్ స్మార్ట్ ఫోన్ చైనాలో తొలిసారి జియోమీని అధిగమించి సత్తా చాటింది. ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ అయిన చైనాలో అత్యధిక స్మార్ట్ ఫోన్లు విక్రయించిన కంపెనీగా ఆపిల్ నిలిచింది. దీంతో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 14.7 శాతం స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సాగించి నెంబర్ వన్ గా నిలిచింది. జియోమీ 13.7 శాతం అమ్మకాలతో రెండో స్థానంలో ఉందని అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. హువాయ్, సామ్ సంగ్, లెనోవా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఐదు కంపెనీలు చైనాలో జనవరి నుంచి మార్చి మధ్యలో 57.8 శాతం అమ్మకాలు జరిపాయని ఐడీసీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News