: ఆర్టీసీ సమ్మె విరమణకు చర్యలు తీసుకోండి... మంత్రివర్గ ఉపసంఘానికి కేసీఆర్ సూచన


ఆర్టీసీ కార్మికుల చేత సమ్మె విరమింపజేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు కార్మికులతో చర్చలు జరపాలని చెప్పారు. సమ్మె విషయంలో సంస్థ ఆర్థిక స్థితిగతులు, కార్మికుల సంక్షేమం, ప్రభుత్వ పరిమితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఉపసంఘ సభ్యులను ఆయన ఆదేశించారు. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సభ్యులతో సీఎం ఈ మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. ఈ ఉపసంఘంలో జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఉన్నారు. ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించే ఆర్టీసీని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News