: హైదరాబాద్ మెట్రో మా డ్రీమ్ ప్రాజెక్టు: దత్తాత్రేయ
హైదరాబాద్ మెట్రో రైలు తమ కలల ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మెట్రో పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరామని తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై దక్షిణమధ్య రైల్వే జీఎంతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దత్తాత్రేయ, పెద్దపల్లి-కరీంనగర్ ట్రాక్ వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని కోరామన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం రక్షణ శాఖ అధీనంలో ఉన్న స్థల సేకరణ కోసం రక్షణ మంత్రితో మాట్లాడతామని చెప్పారు. మెట్రో రెండో దశపై రైల్వే మంత్రి ఆసక్తిగా ఉన్నారని, హైదరాబాద్ మెట్రో నగరవాసులకు ఎంతో ఉపయోగకరమని రైల్వే జీఎం శ్రీవాత్సవ అన్నారు. శంషాబాద్ వరకు ఎంఎంటీఎస్ పొడిగించే ఆలోచన ఉందని, రైల్వే కాలనీ నుంచి వాటర్ పైప్ లైన్ వేయాలని కోరామని తెలిపారు.