: తల నరికి తీసుకెళ్లారు... భయాందోళనలతో వణికిపోతున్న స్థానికులు


విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం చినకెళ్తారీ గ్రామ ప్రజలు భయాందోళనలతో వణికిపోతున్నారు. దీనికి కారణం ఓ భయంకర హత్య. గ్రామానికి చెందిన పోతురాజు (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ తెల్లవారుజామున అతన్ని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. తలను నరికి, మొండెం నుంచి వేరుచేశారు. అనంతరం తలను తమతో పాటే తీసుకెళ్లారు. ఈ ఘటన గ్రామంలో భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఈ మృతి వెనుక గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులు కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News