: మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా


మూడేళ్లుగా ప్రేమిస్తూ, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెబుతూ వచ్చిన ప్రియుడు... మరో పెళ్లికి సిద్ధమవడంతో ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ ఘటన హైదరాబాదులోని నేరేడ్ మెట్ లోని వాజ్ పేయి కాలనీలో ఈ రోజు జరిగింది. వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన స్రవంతి... వాజ్ పేయి కాలనీలో నివాసం ఉంటోంది. అదే కాలనీలో ఉన్న డ్రైవర్ లక్ష్మణ్ తో ఆమె ప్రేమలో పడింది. గత మూడేళ్లుగా వాళ్లు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెబుతూ వస్తున్న లక్ష్మణ్ ఈ నెల 14 మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలియడంతో, స్రవంతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News