: ఉద్యోగుల టూర్ కోసం రూ.236 కోట్లు ఖర్చు చేసిన చైనా పారిశ్రామికవేత్త!


పెట్టిన పెట్టుబడులు అనతికాలంలోనే తిరిగి రావడంతో పాటు లాభాలు చేతికందితే, ఆ పారిశ్రామికవేత్త ఆనందానికి అవధులే ఉండవు. జీవనాధారం కోసం ప్రారంభించిన వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంటే వ్యాపారి సంతోషానికి హద్దులే ఉండవు. మరి ఈ ఆనందాలు, సంతోషాలకు సంస్థలో పనిచేసే కార్మికుల పనితీరే కారణం కదా. ఈ విషయం మెజారిటీ యజమానులకు అర్థం కాదు. అర్థమైనా, అర్థం కానట్టే నటిస్తారు. అయితే చైనాకు చెందిన టియన్స్ గ్రూప్ అధినేత లీ జిన్ యువాన్ మాత్రం అలాంటి వ్యక్తి కాదు. ఉద్యోగుల కోసం కొండ మీది కోతినైనా తెచ్చిచ్చేందుకూ ఆయన ఏమాత్రం వెనుకాడరు. నిజమండీ బాబూ, సంస్థ ఉన్నతికి కారణమైన ఉద్యోగులను సరదాగా ఫ్రాన్స్ టూర్ కు తీసుకెళ్లిన ఆయన, అందుకోసం ఏకంగా రూ.236 కోట్లు ఖర్చు చేశారు. ఈ మొత్తం ఆయన కంపెనీ వార్షికాదాయంలో సగభాగమట. ఖర్చుదేముంది, సిబ్బంది సంతోషంగా ఉండాలంటున్నారు ఆయన. ఇక పర్యటన వివరాల్లోకెళితే, ఫ్రాన్స్ టూర్ కెళ్లిన 6,400 మంది ఉద్యోగులు ప్యారిస్, కేన్స్, మొనాకోలో సరదాగా విహరించారు. ఉద్యోగుల కోసం యువాన్, ప్యారిస్ లో ఏకంగా 140 హోటళ్లను అద్దెకు తీసుకోగా, కేన్స్, మొనాకోల్లో 4,760 గదులను బుక్ చేశారట. తమ పట్ల యువాన్ చూపిన ప్రేమకు నిదర్శనంగా ఆయనకు ఉద్యోగులు మంచి గిఫ్టే ఇచ్చారు. ‘‘టియన్స్ డ్రీమ్ ఈజ్ నైస్’’ అని అర్థం వచ్చేలా భారీ మానవహారంగా ఏర్పడి గిన్నీస్ రికార్డు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News