: కొండూరులో దొంగల బీభత్సం... అత్తాకోడళ్లపై కత్తులతో దాడి, రూ.3 లక్షల సొత్తు చోరీ


కృష్ణా జిల్లా నందిగామ మండలం కొండూరులో దోపిడీ దొంగలు గత రాత్రి బీభత్సం సృష్టించారు. జనమంతా నిద్రిస్తున్న వేళ ఓ ఇంటిలోకి చొరబడ్డ దొంగలు ఇంటిలోని అత్తాకోడళ్లు జానకి, లావణ్యలపై కత్తులతో దాడి చేశారు. అనంతరం ఇంటిలో దాచిన రూ.3 లక్షల విలువ చేసే సొత్తును ఎత్తుకెళ్లారు. దొంగల దాడిలో అత్తాకోడళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిద్దరినీ నందిగామ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చోరీపై సమాచారం అందుకున్న పోలీసులు చోరుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News