: హైదరాబాదులో భారీ అగ్ని ప్రమాదం... బతికి బయటపడ్డ 8 మంది కార్మికులు


హైదరాబాదులోని బాలానగర్ లో నేటి తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాన్ల విడిభాగాలు తయారు చేసే హర్ష ప్లాస్టిక్ కంపెనీలో గ్యాస్ సిలిండర్లు పేలి మూడంతస్తుల ఫ్యాక్టరీ భవనం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో విధుల్లో నిమగ్నమైన ఎనిమిది మంది కార్మికులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డారు. తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాదంలో మూడు గంటలు గడిచినా మంటలు అదుపులోకి రాలేదు. ఎనిమిది ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నా ఫలితం కనిపించలేదు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో పరిసర ప్రాంతాలు దట్టమైన పొగలో చిక్కుకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

  • Loading...

More Telugu News