: సొంతగడ్డపై ముంబయికి నిరాశ


ముంబయి వాంఖెడే స్టేడియంలో నేడు భారీ స్కోర్ల సమరం జరిగింది. ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో విజయలక్ష్మి బెంగళూరు జట్టునే వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 235 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ 133, కోహ్లీ 82 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 13 పరుగులు చేసిన గేల్... మలింగ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఇక, లక్ష్య ఛేదనలో ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఓపెనర్ సిమ్మన్స్ (68 నాటౌట్) చివరివరకు క్రీజులో నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. పొలార్డ్ 49 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో పటేల్, చహల్ చెరో 2 వికెట్లతో రాణించారు. మెరుపు సెంచరీతో అలరించిన ఏబీ డివిలియర్స్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందజేశారు.

  • Loading...

More Telugu News