: విజయవాడలో బొండా ఉమ కొడుకు బర్త్ డే... బైక్ ర్యాలీతో హడలెత్తించిన యువకులు
విజయవాడలో టీడీపీ శాసనసభ్యుడు బొండా ఉమ తనయుడి జన్మదినం సందర్భంగా యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ బైక్ ర్యాలీ ఎలా సాగిందంటే... ఒక్కో బైక్ పై నలుగురు యువకులు ఎక్కారు. దాదాపు 50 బైక్ లు పాల్గొన్న ఆ ర్యాలీ విజయవాడ వీధుల్లో ప్రకంపనలు సృష్టించింది. భీకరమైన వేగంతో దూసుకెళ్లారు. నినాదాలు, వాటికి తోడు పెద్ద శబ్దంతో హారన్ కొడుతూ సాగిన ఈ ర్యాలీ బెజవాడ వాసులను భయాందోళనలకు గురిచేసింది. ఇక, బెంజ్ సర్కిల్, వారధి, బందర్ రోడ్డు, మొగల్రాజపురం, గాయత్రి నగర్ ప్రాంతాల్లో కార్ల డోర్లపై నిలబడి బాణాసంచా కాల్చారు. ఎమ్మెల్యే తనయుడి కోసం అయితే మాత్రం, ఈ స్థాయిలో బైకులు నడుపుతారా? ఇలాంటి ఫీట్లు చేస్తారా? అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.