: 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాల్సిందే... సమ్మె వాయిదా వేసే ప్రసక్తేలేదు: ఈయూ నేత పద్మాకర్


ఏపీ మంత్రివర్గ ఉపసంఘంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు జరిపిన చర్చలు మరోసారి విఫలం అయ్యాయి. 43 శాతం ఫిట్ మెంట్ పై పీటముడి వీడలేదు. చర్చల అనంతరం ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) నేత పద్మాకర్ మాట్లాడుతూ... ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ పై హామీ ఇవ్వలేదని, తాము కోరిన మేరకు ఫిట్ మెంట్ ప్రకటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల ఇబ్బందులు, సంస్థ ఆర్థిక స్థితి దృష్ట్యా సమ్మె వాయిదా వేయాలని మంత్రులు కోరారని ఆయన తెలిపారు. అయితే, 43 శాతం ఫిట్ మెంట్ సాధించుకునే వరకు సమ్మె వాయిదా వేసే ప్రసక్తేలేదని పద్మాకర్ ఉద్ఘాటించారు. చార్జీలు పెంచకుండా 43 శాతం ఫిట్ మెంట్ ఎలా ఇవ్వవచ్చో నివేదిక ఇచ్చామని తెలిపారు. సంస్థ సరకు రవాణా చేపడితే ఆదాయం వస్తుందని వివరించామని చెప్పారు. సీఎంతో చర్చించి నిర్ణయం చెబుతామన్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News