: కృష్ణా జిల్లాలో దారుణం... సిగరెట్ అప్పు ఇవ్వలేదని ప్రాణాలు తీశాడు!


కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వీరులపాడు గ్రామంలో సుధాకర్ అనే వ్యక్తి సిగరెట్ కోసం ఓ దుకాణానికి వెళ్లాడు. సిగరెట్ అప్పుగా అడిగాడు. అయితే, పాతబాకీ చెల్లిస్తేనే సిగరెట్ ఇస్తానని దుకాణదారు నరసింహారావు (70) స్పష్టం చేశారు. దీంతో, సుధాకర్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వృద్ధుడని కూడా చూడకుండా, నరసింహారావుపై దాడి చేశాడు. అడిగితే సిగరెట్ ఇవ్వవా? అంటూ విచక్షణా రహితంగా కొట్టాడు. తీవ్రంగా దెబ్బలు తిన్న నరసింహారావు ప్రాణాలు విడిచాడు. ఇది చూసిన స్థానికులు సుధాకర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. సుధాకర్ మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు.

  • Loading...

More Telugu News