: జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు!
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంటోంది. అయితే, వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవుతుందని వివరించింది. ఎల్ నినో కారణంగా వర్షపాతం తక్కువగా ఉంటుందని ఐఎండీ అధికారి పేర్కొన్నారు. కాగా, ఖరీఫ్ పంటలకు నైరుతి రుతుపవనాలు ఎంతో కీలకం. గత ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం కంటే 12 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో, ధాన్యాలు, పత్తి, నూనె గింజల పంటలు బాగా దెబ్బతిన్నాయి. కాగా, రుతుపవనాల రాకపై ఐఎండీ ఈ నెల 15న అధికారిక ప్రకటన చేయనుంది. అయితే, రుతుపవనాలు రెండు మూడు రోజులు ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది.