: తండ్రి అయిన క్రికెటర్ శ్రీశాంత్
టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి అయ్యాడు. అతని భార్య భువనేశ్వరి కేరళలోని తిరువనంతపురంలో ఆడ శిశువుకు జన్మనిచ్చారు. మాతృదినోత్సవం నాడు మాకు చిన్ని తల్లి జన్మించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ శ్రీశాంత్ ట్వీట్ చేశాడు. శ్రీశాంత్, భువనేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీశాంత్ ఇండియా తరపున 53 వన్డేలు, 27 టెస్టులు ఆడాడు.