: టాలీవుడ్ నిర్మాత చిల్లర కల్యాణ్ అరెస్ట్... వెనువెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు


భూ వివాదంలో మహిళా వైద్యురాలిపై దాడి చేసిన టాలీవుడ్ నిర్మాత చిల్లర కల్యాణ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు కింద ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారాన్ని పంచుకోవడంలో తలెత్తిన వివాదంలో ఆయన, వైద్యురాలు కవితపై నాలుగు రోజుల క్రితం చేయి చేసుకున్నారు. దీనిపై కవిత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కల్యాణ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కవిత ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నేటి సాయంత్రం అతడిని అరెస్ట్ చేశారు. అయితే వెనువెంటనే ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసి పంపించివేశారు.

  • Loading...

More Telugu News