: తూర్పుగోదావరిలో మరో మోసగాడు!
తూర్పుగోదావరి జిల్లాలో మాయగాడు అవినాష్ ఎపిసోడ్ మర్చిపోకముందే మరో ఘరానా మోసగాడు వెలుగుచూశాడు. రాజోలు మండలం చింతలపల్లికి చెందిన ప్రవీణ్ అనే మాయగాడు, పోలీస్ ఇన్ఫార్మర్నని చెప్పుకుని అమ్మాయిలకు గాలమేశాడు. పోలీసు ఉన్నతాధికారులు తెలుసని చెబుతూ, అనేక అసాంఘిక కార్యకలాపాలకు తెరతీశాడు. సెటిల్మెంట్లు చేస్తూ దందా నడిపాడు. సత్యరాజ్ అనే వ్యక్తితో ఘర్షణ పడడంతో ప్రవీణ్ అసలు రంగు బయటపడింది. సత్యరాజ్ మలికిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు అవాక్కయ్యే విషయాలు తెలుసుకున్నారు. దీంతో తక్షణం అతగాడి కారును సీజ్ చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతని బాధితులు తమను సంప్రదించాలని మలికిపురం పోలీసులు విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రవీణ్ విచారణ విషయాలను వెల్లడించకపోవడం విశేషం.