: 'సాయ్' స్పోర్ట్స్ అకాడమీలో ఉండలేం: సెలవుపై వెళ్లిపోయిన 20 మంది అథ్లెట్లు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పోర్ట్స్ అకాడమీలో ఉండలేమని చెబుతూ 20 మంది అథ్లెట్లు సెలవుపై వెళ్లిపోయారు. కేరళలోని అళప్పూజలో ఉన్న 'సాయ్'లో సీనియర్లు, కోచ్ ల వేధింపులు తాళలేని నలుగురు జూనియర్లు ఆత్మహత్యాయత్నం చేయగా, అపర్ణ అనే క్రీడాకారిణి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మర్చిపోలేకపోతున్నామని, జరిగిన ఘటనను మర్చిపోయేందుకు కొంత సమయం కావాలని కోరుతూ 20 మంది క్రీడాకారిణులు 'సాయ్' డైరెక్టర్ ఇంజేటి శ్రీనివాస్ కి తెలిపారు. దీంతో ఆయన వారికి సెలవు మంజూరు చేశారు.