: పుట్టింది కవలలే...కానీ తండ్రి ఒక్కరు కాదు


తల్లి గర్భం నుంచి కొన్ని సెకన్ల తేడాతో జన్మించిన ఆ కవలలకు తండ్రులు మాత్రం ఇద్దరు. దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం తన భార్యకు జన్మించిన కవల పిల్లల్లో ఒకరికే తండ్రినని, తన ద్వారా పుట్టిన పిల్లాడి సంరక్షణ బాధ్యత మాత్రమే తాను చూస్తానని అతను స్పష్టం చేశాడు. అయితే, దీనితో కవలల తల్లి విభేదించింది. ఇద్దరి సంరక్షణ చూడాలని డిమాండ్ చేసింది. దీంతో ఈ వివాదం కోర్టుకెళ్లింది. కాగా, కోర్టులో భార్యభర్తలు తమ వాదనే సబబంటే, తమదే కరెక్టు అన్నారు. ఈ క్రమంలో భార్య జరిగిన విషయాన్ని న్యాయస్థానం ముందు వెల్లడించింది. భర్తతో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తితో ఒకే వారంలో తాను శృంగారంలో పాల్గొన్నట్టు తెలిపింది. దీంతో న్యాయస్థానం, డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించింది. ఆ పరీక్షల్లో కవలల తండ్రి ఒకరు కాదని, ఇద్దరని తేలింది. రుతుస్రావ సమయంలో ఆమె వారం వ్యవధిలో ఇద్దరితో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇద్దరి ద్వారా తల్లి అయినట్టు తెలిపిన వైద్యులు, వైద్య శాస్త్రంలో ఇది అరుదైన సంఘటనగా తేల్చారు. దీంతో, న్యాయస్థానం ఏం తీర్పు చెబుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News