: బీజేపీ నేత నాగం కుమారుడికి తప్పిన ప్రమాదం
బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి చిన్న కుమారుడు శశిధర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం నాగం తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఆయనతో పాటు కుమారుడు, మరికొంతమంది కార్లలో వెళుతుండగా మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి శశిధర్ బయటపడగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిసింది. వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.