: వరల్డ్ కప్ విమర్శలు కోహ్లీతో అనుబంధాన్ని పెంచాయి: అనుష్క శర్మ
వరల్డ్ కప్ సందర్భంగా సెమీ ఫైనల్లో కోహ్లీ ఫెయిల్యూర్ పై తన ప్రభావం ఉందని వచ్చిన విమర్శలే తమ బంధం బలపడడానికి కారణమయ్యాయని అనుష్క శర్మ చెప్పింది. ఆర్మీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కారణంగా ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటానని ఆమె తెలిపింది. అందుకే కోహ్లీ మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేయలేదని, తనను విమర్శించినా నిబ్బరంగా ఉండగలిగానని అనుష్క చెప్పింది. సినీ రంగంలోకి వచ్చిన మొదట్లో ఎవరేమనుకుంటారోనని కంగారు పడేదాన్నని, ఇప్పుడు తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు ఏదైనా అంటేనే స్పందిస్తానని, మిగిలినవి పెద్దగా పట్టించుకోనని అనుష్క స్పష్టం చేసింది. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు తన తల్లిదండ్రులు, సోదరుడు, కోహ్లీ మాత్రమేనని తెలిపింది. తమ ఇద్దరి అభిప్రాయాలు ఒకటేనని అనుష్క చెప్పింది. తామిద్దరం మధ్యతరగతి నుంచి వచ్చి, స్వయం శక్తితో పైకి ఎదిగిన వారమని అనుష్క తెలిపింది.