: 'రిలయన్స్ పవర్'కు ఇచ్చిన బొగ్గు గనిని వెనక్కు తీసుకున్న కేంద్రం
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ సుసాన్ లో నిర్వహిస్తున్న ఆల్ట్రామెగా పవర్ ప్రాజెక్టుకు అవసరమయ్యే బొగ్గును అందిస్తున్న గనిని వెనక్కు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తరహా విద్యుత్ కంపెనీలకు ఇచ్చిన గనుల్లో అధికంగా ఉత్పత్తి అవుతున్న బొగ్గును వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూ, కంపెనీలు లాభాలను పొందుతున్నాయని వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో సుసాన్ పవర్ ప్రాజెక్టుకు మూడు గనులు ఇవ్వగా, రెండింటితో విద్యుత్ ఉత్పత్తి అవసరాలు తీరుతాయని భావిస్తూ, మూడవ దాన్ని రద్దు చేయాలని కేంద్ర బొగ్గు, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మంత్రి పీయుష్ ఆదేశాలిచ్చారని తెలిపారు.