: 'భజరంగీ భాయ్ జాన్' సినిమా షూటింగ్ కు సల్లూభాయ్


'హిట్ అండ్ రన్' కేసులో ఊరట పొందిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఉత్సాహంగా ఉన్నాడు. బెయిల్ లభించడంతో షూటింగుల్లో పాల్గొనేందుకు సల్లూభాయ్ సిద్ధమవుతున్నాడు. కాశ్మీర్ లో జరిగే 'భజరంగీ భాయ్ జాన్' సినిమా షూటింగ్ కు నేడు హాజరుకానున్నాడు. 'హిట్ అండ్ రన్' కేసులో ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్కు ఐదేళ్ల శిక్ష విధించగా, దానిని నిలుపుదల చేస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ సల్మాన్ లో ఉత్సాహం నింపింది. కాగా, సల్లూభాయ్ జింకల వేట కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది.

  • Loading...

More Telugu News