: మిర్యాలగూడలో ముగ్గురు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాయత్నం


ఈ ఉదయం మిర్యాలగూడ బస్టాండు వద్ద ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగింది. నాలుగో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల నేతల సారథ్యంలో ఉద్యోగులు బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అంతకుముందే అధికారులు కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో కొన్ని బస్సులను బయటకు పంపారు. ఈ దశలో కార్మికులు బస్సుల అద్దాలు పగులగొట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేసి స్వల్ప లాఠీచార్జ్ జరిపారు. దీన్ని నిరసిస్తూ, ముగ్గురు కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పెట్రోలు పోసుకొని నిప్పంటించుకోబోగా తోటి ఉద్యోగులు, పోలీసులు అడ్డుపడ్డారు.

  • Loading...

More Telugu News