: ఒబామా కొలువులో మరో ఐఐటియన్
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ విద్యను అభ్యసించిన నేపాలీ అమెరికన్ సంజితా ప్రధాన్ కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక పదవిని అప్పగించారు. ఆపీస్ (ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్) సలహా సంఘం బాధ్యతలు అప్పగించారు. "వీరు అత్యంత అంకితభావంతో తమ విధులను నిర్వర్తిస్తూ, అమెరికా ప్రజలకు సేవ చేస్తున్నారు. వీరితో కలసి పనిచేయాలని భావిస్తున్నాను" అని సంజితా నియామకం సందర్భంగా ఒబామా వ్యాఖ్యానించారు. 2013 నుంచి ఆమె లోవా డిపార్ట్ మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో విధులు నిర్వర్తించారు. అంతకుముందు క్యాథలిక్ చారిటీస్ లో రీసెటిల్ మెంట్ విభాగం డైరెక్టరుగా కూడా పనిచేశారు.