: హైవేపై కూలిన విమానం...నలుగురి మృతి
ఛార్టర్డ్ ఫ్లైట్ లు రోడ్డుమీద దిగేందుకు ప్రయత్నించడం అమెరికాలో సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా, నిత్యం రద్దీగా ఉండే ఓ హైవేపై తేలికపాటి విమానం కూలిపోయిందని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. చాంబ్లీలోని డెకాబ్-పీచ్ ట్రీ విమానాశ్రయం నుంచి బయల్దేరిన సింగిల్ ఇంజిన్ విమానం ఇంటర్ స్టేట్ 285 జాతీయ రహదారి వద్ద నియంత్రణ కోల్పోయింది. దీంతో హైవేపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురూ మృతి చెందారు. రద్దీగా ఉండే జాతీయ రహదారిపై కూలిన విమానం కింద వాహనాలు చిక్కుకోకపోవడం ఊరట కల్గించే అంశమే.