: పురుషుడిపై ముగ్గురు మహిళల అత్యాచారం... దక్షిణాఫ్రికాలో కేసు నమోదు


దక్షిణాఫ్రికాలో ముగ్గురు మహిళలు తుపాకి చూపి బెదిరించి అత్యాచారం చెయ్యడంతో పాటు అతడి వీర్యాన్ని దోచుకుపోయారట. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన గాంటెంగ్ నగరంలో జరిగింది. బీఎండబ్ల్యూ కారులో వచ్చిన ముగ్గురు మహిళలు ఒంటరిగా వెళ్తున్న 33 ఏళ్ల యువకుడిని దారి అడుగుతున్నట్టుగా మాట్లాడుతూ, తుపాకి చూపి బెదిరించి, కారెక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఆపై ఓ నిర్మానుష ప్రాంతంలో కారును ఆపి శృంగారానికి పురిగొల్పగా యువకుడు ఎంతసేపటికీ స్పందించలేదు. దీంతో విసుగొచ్చిన వారు ఒక మందును అతని చేత బలవంతంగా తాగించారు. దీంతో అతనిలో కోరికలు పెరిగిపోవడంతో ఒక్కసారిగా అతడిపై పడి వీర్యాన్ని తీసి ప్లాస్టిక్ బాక్స్ లో భద్రపరిచి దాన్ని ఐస్ బాక్స్ లో పెట్టుకొని మరీ తీసుకువెళ్లారట. ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతుండడంతో ఎలా ఆపాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

  • Loading...

More Telugu News