: ఇకపై ఆన్ లైన్లోనూ 'అయ్యవార్ల' బుకింగ్
మీ ఇంట్లో ఏదైనా వ్రతమో, శుభకార్యమో లేదా ఇంకేదో ఆబ్దీకమో వంటి కార్యాలున్నాయా? సమయానికి క్రతువు నిర్వహించే బ్రాహ్మలు దొరుకుతారా? లేదా? అని భయపడుతున్నారా? ఇకపై ఆ సమస్య ఉండదు. ఆన్ లైన్లో పండితులను బుక్ చేసుకోవచ్చు. superpandit.com అంటూ మహారాష్ట్ర బ్రాహ్మల కుటుంబంలో పుట్టిన అశుతోష్ తివారీ, యోగేష్ దూబేలు ప్రారంభించిన స్టార్టప్ వెబ్ సైట్ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యాన్ని పెంచుకుంటోంది. వివిధ రకాల క్రతువులకు సంబంధించి పూజారులను, బ్రాహ్మలను ఈ వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ముంబై, నాసిక్, నాగపూర్, వారణాసి నగరాలకు పరిమితమైన వెబ్ సైటు సేవలను భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించాలని వీరు ప్రణాళికలు రూపొందించారు. ఈ సైటులో సభ్యత్వం తీసుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ నగరాల బ్రాహ్మణ సంఘాల నుంచి మంచి స్పందన వస్తోంది. చాలా చోట్ల సమయానికి బ్రాహ్మలు దొరకక ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలను చూసి ఈ ఆలోచన వచ్చినట్టు అశుతోష్ చెబుతున్నాడు. ఆల్ ది బెస్ట్!