: ధోనికి నోటీసులు పంపిన జార్ఖండ్ ప్రభుత్వం


జార్ఖండ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి నోటీసులు పంపింది. ఎందుకో తెలుసా? మీకు పొరపాటున ఇంటి స్థలాన్ని ఇచ్చామని, దాన్ని ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని నోటీసులు ఇచ్చింది. అసలు విషయం ఏంటంటే, దేశానికి ధోనీ చేస్తున్న సేవలకు గుర్తింపుగా రాంచీలోని ఓ హౌసింగ్ సొసైటీలో ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించింది. అధికారులు అత్యుత్సాహంతో ఆ స్థలం పక్కనే మరో ఖాళీజాగాను కూడా ధోనీ పేరిట రాసేసి ఆపై నాలిక్కరుచుకున్నారు. ఇప్పుడు దాన్ని వెనక్కు తీసుకోవాలంటే నిబంధనల ప్రకారం వెళ్లక తప్పనిసరి పరిస్థితి. దీంతో పొరపాటున కేటాయించిన ఆ స్థలాన్ని ఎందుకు వెనక్కు తీసుకోరాదో చెప్పాలని నోటీసులు పంపింది.

  • Loading...

More Telugu News