: కన్న తల్లికి గుడి కట్టిస్తున్న సౌతిండియన్ స్టార్


అమ్మకు గుడి కట్టడం, అది కూడా ఆమె జీవించి ఉండగానే... బహుశా ప్రపంచంలోనే ఎక్కడా జరిగి ఉండదు. అటువంటిది, ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన తల్లికి గుడి కట్టిస్తున్నారు. దైవభక్తి అధికంగా చూపే లారెన్స్ ఇప్పటికే తమిళనాడులోని అంబత్తూరులో శ్రీరాఘవేంద్రస్వామి గుడి కట్టించిన సంగతి తెలిసిందే. ఆ ఆలయానికి సమీపంలోనే తన తల్లికి గుడి కట్టించాలని నిర్ణయించుకున్న ఆయన రేపటి మదర్స్ డే సందర్భంగా, శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపాడు. జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేనిదంటున్న లారెన్స్ తల్లికి గుడి కట్టిస్తున్న తొలి కొడుకుగా నిలుస్తాడేమో!

  • Loading...

More Telugu News