: కేంద్రానికి థ్యాంక్స్ చెప్పిన సైనా


ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో ఫైనల్ చేరి చరిత్ర సృష్టించినందుకు కేంద్రం రూ.25 లక్షలు నజరానా ప్రకటించడంపై హైదరాబాదీ తార సైనా నెహ్వాల్ స్పందించింది. అగ్రశ్రేణి క్రీడాకారులకు చేయూతనివ్వడం పట్ల ఆమె కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపింది. వర్ధమాన క్రీడాకారులకు కూడా కేంద్రం ప్రోత్సాహం అందివ్వాలని, మద్దతుగా నిలవాలని సూచించింది. అంతర్జాతీయ ఈవెంట్లలో ప్రతిభ చూపిన, అర్హులైన క్రీడాకారుల పేర్లను ప్రభుత్వ ప్రోత్సాహ పథకంలో చేర్చాలని కోరింది. ప్రభుత్వం కూడా క్రీడాకారులకు ఎంతగానో సహకరిస్తోందని నొక్కి చెప్పింది.

  • Loading...

More Telugu News