: సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నాం: స్వాతి లాక్రా
సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నామని హైదరాబాదు అడిషనల్ కమిషనర్ స్వాతి లక్రా తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, సైబర్ నేరాలకు సంబంధించి సుమొటోగా 36 కేసులు నమోదు చేశామని అన్నారు. ఇలాంటి నేరాలకు సంబంధించిన కేసుల్లో 14 మందిని అరెస్టు చేశామని ఆమె చెప్పారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ద్వారా ఆన్ లైన్ మోసాల భరతం పడుతున్నామని ఆమె వెల్లడించారు. ఎవరూ తమ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అపరిచితులకు ఇవ్వవద్దని ఆమె సూచించారు. లాటరీ అంటూ మెయిల్స్ వస్తే వాటిని వదిలేయాలని, వాటికి సమాధానం ఇవ్వవద్దని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి మోసాలు పెరిగిపోతున్నాయని ఆమె తెలిపారు.