: సల్మాన్ బెయిల్ పై బాలీవుడ్ హర్షం
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల బాలీవుడ్ నటీనటులు హర్షం వ్యక్తం చేశారు. సల్మాన్ బెయిల్ పట్ల పలువురు నటీనటులు ట్విట్టర్లో పలు వ్యాఖ్యలతో ఆనందం పంచుకున్నారు. మన అందరి ప్రార్థనలు దేవుడు విన్నాడని నటుడు రోహిత్ రాయ్ ట్వీట్ చేయగా, సల్మాన్ కు బెయిల్ లభించడం తమకు ఎంతో సంతోషం కలిగించిందని అమీషాపటేల్, సాజిద్ ఖాన్, అమృతారావు, సతీష్ కౌషిక్ తదితరులు ట్వీట్ చేశారు. సల్లూభాయ్ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.