: సుజనా చౌదరికి సినీనటుడు శివాజీ సూటి ప్రశ్న


ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేపట్టి... అందరి దృష్టిని ఆకర్షించిన సినీ నటుడు శివాజీ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీపై విరుచుకు పడ్డారు. అదే సమయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు ఏకంగా ప్రశ్నావళినే సంధించారు. చివరగా టీడీపీ ఎంపీ సుజనా చౌదరిని కూడా శివాజీ వదల్లేదు. సుజనాను సూటిగా ఒక ప్రశ్న అడిగారు. ఏపీకి కేంద్రం ఇస్తామన్న రూ. 14 వేల కోట్లలో రూ. 10వేల కోట్లు వచ్చాయని సుజనా చెబుతున్నారని... ఆ డబ్బు ఏపీ ఖజానాకు చేరిందా? అని ప్రశ్నించారు. ఈ విషయం సుజనా చౌదరి చెబితే సరిపోదని... ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చెప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వెయ్యి కిలోమీటర్ల రోడ్లు వేయడానికి కూడా సరిపోవని విమర్శించారు.

  • Loading...

More Telugu News