: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు బ్రిటన్ ఎంపీ అయ్యారు!


బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికల తాజా ఫలితాల్లో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునాక్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక్కడ కన్సర్వేటివ్ పార్టీ తరపున నార్త్ యార్క్ షైర్ లోని రిచ్ మాండ్ ఎంపీగా తొలిసారి గెలుపొందారు. మొదటిసారి పోటీ చేసినప్పటికీ ఆయనకు భారీ మెజారిటీ వచ్చిందని సమాచారం. ఆయన వ్యక్తిగత వివరాల్లోకి వెళితే, సునాక్ యూకేలోని సౌతంప్టన్ నగరంలో జన్మించారు. ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫర్డ్ నుంచి డిగ్రీ పట్టాలు అందుకున్నారు. స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటుండగానే నారాయణమూర్తి కుమార్తె అక్షతతో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరికీ 2009లో బెంగళూరులో వివాహమైంది.

  • Loading...

More Telugu News