: ఎంసెట్ కు సహకరించిన అందరికీ ధన్యవాదాలు: మంత్రి శిద్ధా


ఈ ఉదయం జరిగిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు సహకరించిన అందరికీ ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు కృతజ్ఞతలు తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని, దూర ప్రాంత విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశామని చెప్పారు. ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు మంత్రి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు మొండి వైఖరి వీడి విధుల్లో చేరాలని ఈ సందర్భంగా కోరారు. కార్మికులు చర్చలకు వస్తే ఆహ్వానిస్తామని, ఆర్టీసీలో ఇప్పటికే కొత్త నియామకాలు ప్రారంభించామని వివరించారు. రేపు 60 శాతం బస్సులు నడిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ తనకు తెలియదన్నారు.

  • Loading...

More Telugu News