: రాజకీయ అస్థిత్వం కోసమే రాహుల్ పర్యటన: 'టీఆర్ఎస్' కవిత
రాజకీయ అస్థిత్వం కోసమే రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలో ఉండగా దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫోటోలకు ఫోజులిచ్చే ప్రభుత్వం కాదని ఆమె ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధితో రైతులకు మేలు చేయాలని కాంక్షించే ప్రభుత్వం తమదని ఆమె తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.