: పొక్లెయిన్ నడిపిన చంద్రబాబు... కార్యకర్తల హర్షాతిరేకం


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీరు-చెట్టు కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నేడు కడప జిల్లాలో పర్యటించారు. కమలాపురం మండలం చవితిరాళ్ల చెరువులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పొక్లెయిన్ నడిపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పూడికతీత పనుల్లో బాబు స్వయంగా పొక్లెయిన్ నడపడంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెల్లుబికింది. ఆపరేటర్ సూచనలతో సీఎం పొక్లెయిన్ ను ముందుకు ఉరికించగా, కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు. అటు, కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా పొక్లెయిన్ నడిపి ఎర్రచెరువు పూడికతీత పనులను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News