: జూన్ 1 రాత్రి నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు: బీపీ ఆచార్య


జూన్ 1వ తేదీ రాత్రి నుంచి 7 వరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు తెలంగాణ సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య ప్రకటించారు. జూన్ 2న అన్ని జిల్లా కేంద్రాల్లో అమరుల స్థూపాల వద్ద మంత్రులు నివాళులర్పిస్తారని, తరువాత ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకం ఆవిష్కరిస్తారని చెప్పారు. తరువాత వివిధ రంగాల ప్రముఖులకు అవార్డుల ప్రదానం జరుగుతుందని ఆచార్య తెలిపారు. జూన్ 7న హైదరాబాద్ లో కళాకారులతో ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News