: 'మత హింస' విషయంలో మోదీ, ఒబామా ఒకటే: రిచర్డ్ వర్మ
మతపరమైన హింసా సంఘటనల విషయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఒకే విధంగా స్పందిస్తున్నారని ఇండియాలో యూఎస్ అంబాసిడర్ రిచర్డ్ వర్మ అభిప్రాయపడ్డారు. భారత్ లో చర్చిలపై జరుగుతున్న దాడుల తరహాలోనే అమెరికాలో అక్కడక్కడా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని ఆయన గుర్తు చేస్తూ, సంప్రదాయాలు నిండిన ఇండియా వంటి దేశంలో మతం హింసకు తావుండరాదని అన్నారు. ఇటీవల మత పరమైన విషయాల్లో భారత్ సరిగ్గా స్పందించడం లేదంటూ, అమెరికన్ సంస్థ ఒకటి సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విదేశాంగ శాఖ వివరణ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ స్పందిస్తూ, తమకు ఇండియాతో బలమైన బంధాలున్నాయని, మనస్ఫూర్తిగా మాట్లాడుకోకనే కొన్ని విషయాల్లో విభేదాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.