: ఉమాభారతిని కలిసిన అనంతరం మనసులో మాట చెప్పిన టీఆర్ఎస్ ఎంపీ కవిత
ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్టును వరప్రదాయినిగా అభివర్ణించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రానికి కూడా అటువంటి ఓ ప్రాజెక్టు కావాలని తన మనసులో మాటను వెల్లడించారు. ఈ ఉదయం కేంద్ర మంత్రి ఉమా భారతిని ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి చర్చలు జరిపిన అనంతరం, సమావేశం వివరాలను కవిత వెల్లడించారు. కృష్ణా ట్రైబ్యునల్ అంశంపై ఉమా భారతితో కేసీఆర్ చర్చించారని తెలిపారు. మే 16లోగా ఉమా భారతి తెలంగాణ రాష్ట్రానికి రావడానికి అంగీకరించారని అన్నారు. పోలవరంతో ఏపీకి మేలు జరుగుతుందని, అలాంటి మరో పెద్ద ప్రాజెక్టును గోదావరిపై తెలంగాణ కోసం నిర్మించాలని, అందుకు కేంద్రం సంకల్పిస్తుందని భావిస్తున్నానని ఆమె వివరించారు.