: గాంధీ ఆసుపత్రిలో పనిచేయని లిఫ్టులు... ఆగిపోయిన శస్త్రచికిత్సలు


హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం నుంచి లిఫ్టులు పనిచేయకపోవడంతో వైద్యులు ఆందోళనకు దిగారు. దాంతో ఆసుపత్రిలో 30కి పైగా ఆపరేషన్ లు నిలిచిపోయాయి. మరోవైపు లిఫ్టులు పనిచేయకపోవడంతో వైద్యులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటినుంచో ఆసుపత్రిలో లిఫ్టులు సరిగా పనిచేయడంలేదని, ఆసుపత్రి యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని వైద్యులు అంటున్నారు. తక్షణమే లిఫ్టులను రిపేరు చేయించాలని, లేకుంటే తమ ఆందోళన కొనసాగుతుందని సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యులు బైఠాయించారు.

  • Loading...

More Telugu News