: ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?... లొంగబోనన్న చంద్రబాబు


ఏ డిమాండైనా న్యాయమైనదనిపించి, నెరవేర్చగలిగేదిగా ఉంటే నెరవేర్చేందుకు సిద్ధమని, అలా కాకుండా గొంతెమ్మ కోరికలు కోరుతూ, బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే సహించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కొందరు నాయకుల సూచనల మేరకు సమ్మె జరుగుతోందని ఆయన ఆరోపించారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బస్సులను కూడా అడ్డుకుంటారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయాలు కూడదని, తాను మానవత్వంతో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటానని తెలిపారు. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే లొంగే సమస్యే లేదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News