: బూడిదలో పోసిన పన్నీరైన విద్యార్థిని కష్టం!
ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షను బాగా రాసి సీటు సంపాదించాలన్న ఆ విద్యార్థిని కల తొలి అడుగులోనే ఆగిపోయింది. ఎంసెట్ పరీక్షకు ఒక నిమిషం ఆలస్యం నిబంధన ఆ అమ్మాయి పాలిట శాపమైంది. కూకట్ పల్లిలోని ఎంఎన్ఆర్ కాలేజీలో పరీక్ష రాసేందుకు తల్లిదండ్రులతో కలసి ప్రయాసలు పడి వచ్చిన విద్యార్థిని 10:01 నిమిషానికి గేటు వద్దకు వచ్చింది. ఒక్క నిమిషం మాత్రమే ఆలస్యమైతే లోపలికి పంపాలన్న నిబంధన ఉందని, రెండో నిమిషం వచ్చేసింది కాబట్టి పరీక్షకు వెళ్లనిచ్చేది లేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థిని కన్నీరు పెడుతూ కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. దీంతో, ఎంసెట్ పరీక్ష కోసం తాను పడిన కష్టం అంతా బుడిదలో పోసిన పన్నీరుగా మారిందని విద్యార్థిని విలపించింది. ఆమె తల్లిదండ్రులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.