: రైతుల సమస్యలు తీర్చేది కాంగ్రెస్ ఒక్కటే: దానం నాగేందర్


రైతులకు ఇంతవరకు అన్యాయం చేసిన ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయని టీ.కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ అన్నారు. వారి సమస్యలు తీర్చేది కాంగ్రెస్ ఒక్కటేనని పేర్కొన్నారు. కాసేపటి కిందట హైదరాబాద్ లోని దానం ఇంట్లో గ్రేటర్ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు పాల్గొన్న ఈ భేటీలో రాహుల్ తెలంగాణ పర్యటన, గ్రేటర్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మాట్లాడిన దానం, తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ యాత్రకు ఘన స్వాగతం పలుకుతామని చెప్పారు. ఎయిర్ పోర్ట్, మెహదీపట్నం, పంజాగుట్ట మీదుగా రాహుల్ యాత్ర కొనసాగుతుందన్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతులు అయోమయంలో ఉన్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. తెలంగాణలో 900 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలకు, మిగతా రైతులకు భరోసా కల్పించేందుకే రాహుల్ యాత్ర అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News